Header Banner

రేపు కర్నూలు నగరంలో చంద్రబాబు పర్యటన! ఆ షెడ్యూల్ మీ కోసం!

  Fri May 16, 2025 22:04        Politics

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు నగరంలో పర్యటించనున్నారు. ఉదయం ఉదయం 11.25 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 నిమిషాలపాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తారు. ఉదయం 11.55 గంటలకు సి. క్యాంపు రైతుబజారుకు చేరుకుంటారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి అవుతారు. మధ్యాహ్నం 12.25 గంటలకు నంద్యాల చెక్ పోస్టు కేంద్రీయ విద్యాలయం వద్ద ధనలక్ష్మి నగర్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పార్కు (ఎస్ఏఎస్ఏ పార్క్)కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఒంటి గంటకు ప్రజావేదికలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 2- 3.30 వరకు కర్నూలు నగర ప్రజల ముఖాముఖిలో పాల్గొంటారు.

 

ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు! ఆ 26 జిల్లాల్లో వారికి ఇక పండగే.!

 

సాయంత్రం 3.35- 5.05 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం తిరిగి వెళ్తారు. కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కర్నూలు సి. క్యాంపు రైతుబజారు, నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రజావేదిక ప్రాంతంలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. మార్కెట్ లోపల, బయట పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ధనలక్ష్మి నగర్ లో స్వచ్ఛ ఆంధ్ర పార్కుకు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, కేంద్రీయ విద్యాలయం పక్కన ఖాళీ స్థలంలో ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations